Sai Dharam Tej Opened Up Affair With Regina..

  • 6 years ago
Sai Dharam Tej one of the energitic heros in Tollywood. After Intelligent flop, Sai Dharam Tej speak to a youtube channel.

సాయిధరమ్ తేజ్ కెరీర్ హిట్లు, ఫ్లాపులతో సాగుతున్నది. టాలీవుడ్‌లోకి రావడానికి ముందు తాను పడిన కష్టాలు చాలా ఉన్నాయి అని మెగా మేనల్లుడు చెప్పారు. అన్ని సమయాల్లో తన తల్లి అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తల్లి త్యాగాలే అని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మరికొన్ని ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఆయన పంచుకొన్నారు.
ప్రస్తుతం తనకు సక్సెస్ లభిస్తున్నాయని , ఇప్పుడు డబ్బులు ఉన్నాయని , కానీ గర్ల్‌ఫ్రెండ్ దొరకడం లేదని , మంచి గర్ల్‌ఫ్రెండ్ కోసం చూస్తున్నాను అని చెప్పాడు . తన జీవితంలో రాణిలా ఉండే భార్య కోసం ఎదురుచూస్తున్నాడ్టాట.
నేను అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చులకనగా చూస్తారు. నేను డిగ్రీ చదువుతుండగా ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె యూఎస్‌లో చదువుకునేది. ఇండియాకు వచ్చిన తర్వాత కలువలేదు. చాలా రోజుల తర్వాత వచ్చిన మెయిల్ ఓపెన్ చేస్తే ఆమె పెళ్లి ఫోటో కనిపించింది.
నా ప్రేమ విఫలమైన విషయాన్ని అమ్మతో చెప్పుకొన్నాను. నాకు ముందే తెలిసు ఇలా అవుతుందని అమ్మ చెప్పింది. నీ కోసం మరో అమ్మాయి పుట్టి ఉంటుందిలే అని ధైర్యం చెప్పిందట.
ఇంకా తనకు సమంత అంటే చాలా ఇష్టం. ఏం మాయ చేసావేలో జెస్సీ అంటే బాగా ఇష్టం. సమంతకు కూడా జెస్సీ పాత్రలో నీవంటే ఇష్టమని నేను చెప్పాను. జెస్సీ పాత్రను బాగా లవ్ చేయడం వల్ల మరో అమ్మాయి నచ్చడం లేదేమో అనిపిస్తుంది.

Recommended