కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున...?

  • 6 years ago
Producer Pundariakakshya is trying to make a mythical film with Nagarjuna and Balakrishna's combination. Meegada Ramalingaswamy made the story for this film.

బాలకృష్ణ, నాగార్జున మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఈ ఇద్దరి కాంబినేషన్లో పౌరాణిక సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త ప్రచారంలోకి రావడం అభిమానుల్లో ఆసక్తిరేపింది. బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. తాజా ఈ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో మళ్లీ హాట్ టాపిక్ అయింది.
బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో 'నరనారాయణ' అనే పౌరాణిక చిత్రం చేసేందుకు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారు.
నవావధాని మీగడ రామలింగస్వామి ‘నరనారాయణ' సినిమా కోసం స్కిప్టు సిద్ధం చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.... నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణ కోసం ఈ స్క్రిప్టు రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని, ఇటీవలే అది పూర్తయిందని తెలిపారు.
ఇటీవలే ఈ ప్రాజెక్టును బాలయ్యకు వివరించానని రామలింగస్వామి తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుందని ఆయన వెల్లడించారు.

Recommended