Matt Lauer has deleted his Twitter and Instagram accounts in the wake of several allegations of sexual harassment made against him.
ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు, హాలీవుడ్ దిగ్గజాలు అయిన హార్వే వీన్‌స్టీన్, కెవిన్ స్పేసీల అమానవీయ రాసలీలలు ఇటీవల రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. బహిరంగ వేదికలపై ఆ ఇద్దరిపై తీవ్ర ఆరోపణలు చేశారు బాధితులు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగింది. ఆ క్రమంలోనే ఆ ఇద్దరికి పరిశ్రమ నుంచి అనధికారిక బహిష్కరణ తప్పలేదు. కెవిన్ సినిమాల్ని, సినిమా వేడుకల నుంచి బహిష్కరించారు. వీన్‌స్టీన్‌ని ఆస్కార్ కమిటీ నుంచి తొలగించారు. ప్రఖ్యాత ఎన్‌బిసి చానెల్ హోస్ట్ మాట్ లావెర్ ఆ జాబితాలో కొత్తగా చేరాడు . వేదింపుల వ్యవహారంలో వరుస అలజడుల నేపథ్యంలో.. మ్యాట్ వల్ల ఇబ్బందిపడ్డ కొలీగ్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లైంగిక వేదింపులు ఎదుర్కొన్న వారంతా ఒకరొకరుగా బయటపడుతున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది మహిళా బాధితురాళ్లు అతడి నిర్వాకం గురించి సామాజిక మాధ్యమాల్లో ఓపెన్ అయ్యారు. మ్యాట్‌పై ఎటాక్ చేస్తూ అతడి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్ ఖాతాలకు సందేశాలు పంపుతూ దూషిస్తున్నారు. దీంతో అతడు సామాజిక మాధ్యమాలన్నిటినీ బ్లాక్ చేయించడం సంచలనమైంది. ఓ ప్రకటనలో మ్యాట్ మాట్లాడుతూ-"నా వల్ల ఇబ్బందిపడిన సహచర ఉద్యోగులను క్షమాపణలు కోరుతున్నా. నా మాటల వల్ల, చేష్టల వల్ల ఇబ్బంది పడిన వారికి .. బాధపడిన వారికి సారీ చెబుతున్నా. అయితే "నావల్ల బాధపడిన వారి విషయంలో నేను కూడా రియలైజై బాధపడుతున్నా" అని బహిరంగ ప్రకటన చేశాడు మ్యాట్.