China Dismisses Pakistan General's Allegation on India | Oneindia Telugu

  • 6 years ago
China on Monday dismissed a top Pakistani Army General's allegation that India has established a special intelligence cell at a cost of USD 500 million to sabotage the strategic China-Pakistan Economic Corridor (CPEC).

పాకిస్థాన్‌ను చైనా ఏకిపారేసింది. ప్రతి విషయంలో భారత్‌పై నిందలు వేసే బుద్దిని మానుకోవాలని చైనా పాకిస్థాన్‌కు హితవు పలికింది.500 మిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌పై భారత్‌ గూఢచర్యం చేస్తోందన్న పాకిస్తాన్‌ వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. డోక్లామ్ ఘటనల తర్వాత భారత్‌కు మద్దతుగా చైనా స్పందించింది. అంతేకాదు పాక్ చేసిన ఆరోపణలను చైనా కొట్టిపారేసింది. అనవసరమైన ఆరోపణలు చేయకూడదని పాకిస్థాన్‌కు చైనా హితవు పలికింది. అయితే తొలి నుండి పాక్‌కు చైనా అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలు లేకపోలేదు. అయితే తాజా ఘటన మాత్రం పాక్‌కు చుక్కలు చూపించింది. ఈ ఘటన తర్వాత అయినా పాక్ బుద్ది మార్చుకొంటుందో లేదో చూడాలంటున్నారు రాజకీయ విమర్శకులు.

Recommended