"స్నేహమేరా జీవితం" మూవీ రివ్యూ

  • 7 years ago
Snehamera Jeevitham (as a title) more relevance is its 1982 setting. It was an opportunity that the director Mahesh Upputuri used to unleash great entertainment value with timely political, film and literary references in the Mandapeta Telugu dialect.

టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకొన్న నటుడు శివ బాలాజీ. ఇటీవల కాలంలో కాటమరాయుడు చిత్రంలో పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో విజేతగా నిలువడంతో మరింత క్రేజ్ వచ్చింది.
బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత స్వీయ నిర్మాణ సారథ్యంలో స్నేహమేరా జీవితం సినిమాను తెరక్కెక్కించాడు. మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో శివబాలాజీ‌తో రాజీవ్ కనకాల ఓ ముఖ్యపాత్రను పోషించారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల మదిలో విజేతగా నిలిచాడా అనే విషయాన్ని తెలుసుకునే ముందు కథ గురించి తెలుసుకొందాం.
మోహన్ (శివబాలాజీ) ఓ అనాథ. చలపతి ( రాజీవ్ కనకాల) డబ్బుతో పొగరు ఉన్న యువకుడు. జీవితాల్లో చాలా విభేదాలు ఉన్నప్పటికి వాటన్నింటిని పక్కన పెట్టి మంచి స్నేహితులుగా సాగుతుంటారు. చలపతి టింబర్ డిపోలోనే మోహన్ పనిచేస్తుంటారు. అలా జీవితం గడిచిపోతున్న సమయంలో ఇందిర (సుష్మ) ప్రేమలో పడుతాడు. అయితే చలపతితో ఇందిర చూడకూడని పరిస్థితుల్లో కనిపిస్తుంది. దాంతో ఇందిరపై ప్రేమను తుంచేసుకొంటాడు. స్నేహితుడిపై కోపం పెంచుకొంటాడు. ఇదిలా ఉండగా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందుల్లో పడుతాడు.
తాను ప్రాణంగా ప్రేమించిన మోహన్ ప్రియురాలితో చలపతి అలా ఎందుకు ప్రవర్తించాడు. చలపతి నిజంగానే మోసం చేయాలనుకొన్నాడా? మోహన్ ఎలాంటి విషయాల్లో తలదూర్చాడు. చివరికి ఇందిరను మోహన్ పెళ్లి చేసుకొన్నాడా? చలపతి మోహన్ మధ్య స్నేహం మళ్లీ చిగురించిందా? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే స్నేహమేరా జీవితం.

Recommended