Skip to playerSkip to main content
  • 7 years ago
Brand Babu movie is Prabhakar' second venture after Next Nuvve. Isha Rebba, Sumanth Shailendra are lead pair. Director Maruti pens for This movie. This movie released on August 3rd. In this occassion, Telugu Filmibeat brings exclusive review.


బుల్లితెర మీద స్టార్‌గా ఆకట్టుకొన్న నటుడు ప్రభాకర్ (ఈటీవీ) నెక్ట్స్ నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన ప్రభాకర్ మలి ప్రయత్నంగా దర్శకుడు మారుతితో కలిసి బ్రాండ్ బాబు చిత్రాన్ని రూపొందించారు. బ్రాండ్ బాబులుగా మురళీశర్మ, నూతన నటుడు సుమంత్ శైలేంద్రను ఎంచుకొన్నారు. ఇషా రెబ్బాను తన కథకు కీలక అంశంగా ఎంపిక చేసుకొన్నారు. ఇలా కొత్త బ్రాండ్ క్రియేట్ చేయడానికి ప్రభాకర్ చేసిన ప్రయత్నం సఫలమైందా? బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు పెరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
బ్రాండెడ్ వస్తువులు వాడాలన్న మహా పిచ్చి కలిగిన బిజినెస్ మాగ్నెట్ రత్నం ( మురళీశర్మ). తన ఇంట్లో వాళ్లతోపాటు కుమారుడు డైమండ్ రత్నం (సుమంత్ శైలేంద్ర)ను కూడా అలానే తయారు చేస్తాడు. తండ్రి మాదిరిగానే విలాసవంతమైన బ్రాండ్ వాడే మనుషులు అనే ఫీలింగ్‌లో ఉంటాడు డైమండ్. ఈ క్రమంలో హోంమంత్రి ఇంట్లో పనిచేసే పేదింటి అమ్మాయి రాధ (ఇషా రెబ్బా)తో ఓ విచిత్రమైన కారణంగా పరిచయం జరుగుతుంది. రాధను హోమంత్రి కూతురు అని భ్రమపడిన డైమండ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడుతాడు. తీరా నిశ్చితార్తం వరకు వచ్చే సరికి రాధ హోంమంత్రి కుమార్తే కాదని తెలుసుకొని డైమండ్‌తోపాటు తండ్రి రత్నం షాక్ తింటారు.
Be the first to comment
Add your comment

Recommended