Raju Gadu Movie Review రాజు గాడు మూవీ రివ్యూ
  • 6 years ago
Raj Tarun's Raju Gadu movie Review. Raju Gadu produced by Sunkara Ramabrahmam on AK Entertainments Pvt Ltd banner and directed by Sanjana Reddy. Starring Raj Tarun, Amyra Dastur, Rajendra Prasad in the lead roles and music composed by Gopi Sundar.

ఉయ్యాల జంపాల' లాంటి హిట్‌తో హీరోగా తెరంగ్రేటం చేసిన రాజ్ తరుణ్ ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్' లాంటి వరుస విజయాలు అందుకుని ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండింగ్ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్ నటనతో పాటు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరి విభిన్నంగా, ఈ తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం అతడి ప్లస్ పాయింట్స్. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్..... తర్వాత వరుస ప్లాపులతో వెనకపడిపోయాడు. ఒక్క హిట్ కొట్టి మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పడేసుకుందామని చేసిన ప్రయత్నంలో భాగమే 'రాజు గాడు'. రాజ్ తరుణ్ ఈసారైనా హిట్టుకొట్టాడా? లేదా? ఓసారి సమీక్షిద్దాం.
రాజు (రాజ్ తరుణ్)కు పుట్టుకుతోనే క్లెప్టోమేనియా అనే జబ్బు ఉంటుంది. దీంతో తనకు తెలియకుండానే వస్తువులు కొట్టేస్తుంటాడు. ఇంట్లోవారు, బయటి వారు, స్నేహితులు, బంధువులు అనే తేడా లేకుండా అందరి వస్తువులు దొంగతనం చేస్తుంటాడు. ఈ జబ్బును పోగొట్టడానికి రాజు తండ్రి (రాజేంద్రప్రసాద్) ఎంత మంది డాక్టర్లను కలిసినా ఫలితం ఉండదు. కొడుకు చేసే దొంగతనాలు చివరకు వారికి అలవాటైపోతాయి.
రాజు అందం చూసి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమలో పడతారు. అయితే వారి వస్తువులు కూడా కొట్టేసి వారితో ఛీకొట్టించుకుంటాడు ఈ దొంగ హీరో. అయితే తన్వి(అమైరా దస్తూర్) అనే అమ్మాయి మాత్రం రాజ్ తరుణ్ మనసు దోచేస్తుంది. ఆమెను చూసినప్పటి నుండి ప్రేమ ఊహల్లో మునిగితేలుతుంటాడు. దొంగతనం అంటే అస్సలు సహించని, అలాంటి పనులు చేస్తే కాళ్లు, చేతులు తీసివేసే ఫ్యామిలీ నుండి వచ్చిన తన్వి ప్రేమను దొంగబుద్దులున్న రాజు ఎలా గెలుచుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ.
Recommended