హీరోయిన్ గా వస్తున్న టాప్ హీరో కూతురు

  • 7 years ago
Hero Rajashekhar Daughter Sivani conforms About Her debut as heroine at Garudavega success tour in Palakollu.

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ అవతారం ఎత్తనున్నారు. తమిళ చిత్ర రంగానికి శివాని పరిచయం కానున్నారు. రాజశేఖర్‌, జీవిత దంపతులు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.కొంతకాలంగా కాస్త వెనుకబడ్దట్టే కనిపించిన రాజశేఖర్ గరుడ వేగ హిట్ తో ఇప్పుడు ఆనందం లో ఉన్నాడు.. ఇదే సమయం లో తన సినీరంగ ప్రవేశం పై మళ్ళీ ఒకసారి మట్లాడింది రాజశేఖర్ కుమార్తె శివాని .
కొన్ని నెలలకిందటే తమిళంలో రూపొందే "కుమ్కి 2" చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయనుందన్న వార్తలు వచ్చాయి. శివానీతో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దాదాపు అగ్రిమెంట్‌పై సంతకం చేసే పని కూడా పూర్తి కావొచ్చిందనీ. స్క్రీన్ టెస్ట్‌గా కూడా చేసినట్టు చెప్పారు కానీ తర్వాత మాత్రం ఈ వార్తలు వార్తలుగానే ఉండి పోయాయి.
ఇప్పుడు గరుడవేగ హిట్ తో ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ ఈ సమయం లోనే శివాని ని కూడా హీరోయిన్ గా లాంచ్ చెయ్యాలని అనుకుంటున్నాడట..
పాలకొల్లు అడబాల థియేటర్‌లో శుక్రవారం రాత్రి గరుడ వేగ హీరో రాజశేఖర్‌ సందడి చేశారు. అభిమానులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను సినిమా ఎలా ఉంది...? అంటూ రాజశేఖర్‌ ప్రశ్నించారు.
ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనకు ఆనందించారు. ప్రేక్షకుల అభిమానమే నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టిందన్నారు. నటి జీవిత మాట్లాడుతూ గరుడ వేగ సినిమాను ఇంతగా ఆదరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Recommended