Skip to playerSkip to main content
  • 8 years ago
Varalaxmi Sarathkumar to play the antagonist in Vijay movie

సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.... నటిగా మంచి మార్కులు కొట్టేసి పలు చిత్రాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. తెలుగులో మినహా వరలక్ష్మి సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తోంది. డజనుకుపైగా చిత్రాలు ప్రస్తుతం వరలక్ష్మి చేతుల్లో ఉన్నాయంటే దర్శకులు ఆమెకు ఇస్తున్న ప్రాధ్యానత అర్థం చేసుకోవచ్చు.

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచినప్పటికీ వరలక్ష్మి సెక్సీగా కనిపించడానికి, అందాలు ఆరబోయడానికి వెనుకాడదు.

కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు సైతం సై అంటోంది.

వరలక్ష్మి మరో క్రేజీ రోల్ లో నటించాడని సిద్ధం అయిపోతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించబోతోంది. ఈ విషయాన్ని వరలక్ష్మి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది

మురుగదాస్, విజయ్ చిత్రంలో వరలక్ష్మి పోషించబోయేది విలన్ లక్షణాలు ఉన్న పాత్రగా తెలుస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న వరలక్ష్మి పాత్ర సినిమాకు చాలా కీలకం అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Be the first to comment
Add your comment

Recommended