Skip to playerSkip to main content
  • 8 years ago
It is said that Konda Surekha may join Congress party soon. Congress Party is talking with Konda Surekha.
టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్‌ను వీడే అవకాశాలున్నాయని శుక్రవారం జోరుగా ప్రచారం సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న కొండా సురేఖ అనంతరం టీఆర్ఎస్‌‌ కండువా కప్పుకున్నారు. ఆమె భర్త కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఈ మేరకు వారు పార్టీ టీఆర్ఎస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. తమకు మంత్రిపదవి ఇవ్వకుంటే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం సాగింది.పీసీసీతో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కేవలం వరంగల్ ఈస్ట్ సీటు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ దంపతులకు తేల్చి చెప్పారని ప్రచారం సాగింది. వారు రెండుసీట్లు కోరుతున్నారని, పరకాల కూడా అడుగుతున్నారని వార్తలు వచ్చాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended