Pawan Kalyan JFC Final Report Press Meet | Oneindia Telugu

  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan press meet after joint fact finding committee meeting in Hyderabad.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జేఎఫ్‌సీ హైదరాబాదులోని హోటల్ ఆవాస్‌లో శనివారం సుదీర్ఘంగా భేటీ అయింది. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన నిధులపై ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో లెక్కలు తేల్చేందుకు పవన్ జేఎఫ్‌సీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా కోసం కూడా ఉద్యమిస్తున్నారు. పవన్ పలు అంశాలపై మాట్లాడారు.
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి అభినందనలని పవన్ కళ్యాణ్ అన్నారు. విభజనలో రాజకీయ నాయకుల పాత్ర ఉంది కానీ, ప్రజల పాత్ర లేదన్నారు.
విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలను కదిలించారు కాని, స్థిరాస్థి ఇక్కడే ఉండిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన కారణంగానే జనసేన ఆవిర్భవించిందని చెప్పారు. స్థిరాస్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్పారు. జేఎఫ్‌సి ప్రధానంగా 11 అంశాలను గుర్తించిందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలన్నారు. తాము నైతిక బాధ్యతతో జేఎఫ్‌సీని ఏర్పాటు చేశామన్నారు. తాను టీడీపీకి పార్ట్‌నర్ అని, బీజేపీకి పార్ట్‌నర్ అని కొందరు ప్రచారం చేస్తున్నారని, దానిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను గందరగోళ పరుస్తాయని చెప్పారు.

Recommended