Pawan Kalyan's JFC Meeting With Jayaprakash & Undavalli

  • 6 years ago
Pawan Kalyan to Hold JFC Meeting with JP, Undavalli & other politcians on Friday at Daspalla hotel in Hyderabad. In today's meeting they discuss on central funds for ap.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం 8గం.కు ఆయన జనసేన ఆఫీస్ నుంచి బయలుదేరి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. నివాళులు అర్పించిన అనంతరం తిరిగి నేరుగా జనసేన కార్యాలయానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామిల కోసం జేఎఫ్ సి ద్వారా పోరాటం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. నేడు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి తమ ప్రయత్నం సఫలం కావాలని కోరుకున్నారు
నిధులకు సంబంధించి లెక్కల్ని తమకు పంపించాలని లేదా శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన డెడ్ లైన్ ఈ నెల 15వ తేదీతో ముగిసిపోయింది.
డెడ్ లైన్ అయితే ముగిసింది కానీ.. పవన్ డిమాండ్ చేసినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాత్రం స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే జేఎఫ్‌సి మేదోమథనం ద్వారా ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇందుకోసం నేడు జేఎఫ్‌సి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
హైదరాబాద్ లోని దస్‌పల్లా హోటల్ వేదికగా నేడు, రేపు పవన్ పలువురు రాజకీయ నాయకులు, మేదావులు, నిపుణులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌతమ్ తదితరులు పాల్గొంటారు. కొంతమంది ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Recommended