JFC : Pawan Kalyan says Many Are Showing Interest To Work

  • 6 years ago
Loksatta founder president Jayaprakashnarayana intresting comments on JFC at Hyderabad on Friday in JFC meeting. The meeting witnessed leaders of all parties along with some academicians, experts, and others participating in it.


జన సేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడిని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం నేడు హైదరాబాద్ దసపల్లా హోటల్లో జరుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశాల్లో కేంద్ర నిధులు, విభజన హామీలు వీటికి సంబంధించిన వివరాల సేకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొంటున్నన్యాయమూర్తి గోపాల గౌడ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగిందని, అయితే ఏపీకి రావాల్సిన నిధులు సరిగా రావడంలేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో తనకు చాలా సంతోషంగా ఉందని గౌడ చెప్పారు. న్యాయమూర్తిగా ఉన్న తాను ఈ కమిటీకి కావాల్సిన సలహాలు తప్పకుండా ఇస్తానన్నారు. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇచ్చింది...ఇంకా ఏమేమి ఇవ్వాల్సి ఉంది అనే దానిపై ఒక నివేదిక తయారు చేయడానికే ఈ జెఎఫ్‌సి ఏర్పడిందని, ఇందులో సందేహానికి తావులేదని జస్టిస్ గోపాల గౌడ స్పష్టం చేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌తో తనకు చాలా దగ్గరి సంబంధం ఉందని, తన తల్లిది చిత్తూరు జిల్లా అని జస్టిస్ గోపాల గౌడ చెప్పారు. మరోవైపు జెఎఫ్‌సి సమావేశానికి వైసిపికి చెందిన తోట చంద్రశేఖర్ అనే నేత హాజరుకావడం చర్చనీయాంశం అయింది. ఇదే విషయమై తోట చంద్రశేఖర్ ను ప్రశ్నించగా తాను వ్యక్తిగతంగా సమావేశానికి హాజరయ్యానంటూ తోట చంద్రశేఖర్ మీడియాతో చెప్పడం గమనార్హం. నేడు, రేపు సమావేశఆల అనంతరం జేఎఫ్‌సీ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Recommended