CRDA Allots 115 Plots to Amaravati Farmers Through E-Lottery: భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చిన తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామ రైతులకు సీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఈ- లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ల్యాండ్ పూలింగ్‌లో 9.14 కింద 2015 నుంచి రాజధాని నిర్మాణానికై భూములు అందజేసిన ఉండవల్లి గ్రామానికి చెందిన 195 మంది రైతులకు సీఆర్డీఏ అధికారులు 381 నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. ఈ- లాటరీకి హాజరైన రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైయల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు.ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి రుసుము వసూలు చేయమన్నారు. కొంతమంది రైతులు ప్లాట్లు కేటాయించే విధానాన్ని తప్పు పట్టారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని ప్రాంతాలలో ప్లాట్లు వచ్చాయని సీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వేగంగా ప్లాట్ల కేటాయింపు : మంత్రి నారాయణరాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 195 మంది రైతులకు ప్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్ ల కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు. ప్లాట్లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23 వరకూ క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 10,000 రూపాయిలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. ఎల్ ఆర్ ఎస్ 2025 ద్వారా ఇప్పటివరకూ 61,947 దరఖాస్తులు అందాయన్నారు. లేఅవుట్ల క్రమబద్దీకరణలో అధికారులు అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని సురేష్ కుమార్ హెచ్చరించారు. రాజధాని వేదికగా రిపబ్లిక్ డే వేడుకలు - ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
Comments