జనాలపైకి దూకుడగా వెళ్లి వారిపై దాడి చేసి కరిచే వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాంటి వాటిని గుర్తించి వాటిని ప్రత్యేక షెల్టర్లలో పెట్టాలని నిర్ణయించింది. ఇందుకుగాను నగరపాలక సంస్థల్లో దశల వారీగా డేంజరస్ యానిమల్ పౌండ్లు ఏర్పాటు చేయాలని కమిషనర్లను ఆదేశించింది. రాష్ట్రంలో 123 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో 5.15 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. వీటిలో 10 నుంచి 15% మేర దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు అంచనా. చిన్నారులపై దాడి చేస్తున్నవి, రోడ్లపై వెళ్లే వారిని గాయపరిస్తున్నాయని ఇవేనని అధికారులు గుర్తించారు. వీటిని ప్రత్యేక షెల్టర్లలో పెట్టాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా కుక్క కాట్లు నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వీధికుక్కల దాడుల నియంత్రణ నుంచి ప్రజలను కాపాడేందుకు నగరపాలక సంస్థల్లో విధిగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.అందుకుగానూ ఒక్కో దానిపై రూ.1,500 చొప్పున ఖర్చు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. క్లస్టర్ సెంటర్లకు తీసుకెళ్లే వాటిపై అదనంగా మరో రూ.100 ఖర్చు చేయనున్నారు. జంతు సంక్షేమ సంస్థలు సెంటర్లను పశుసంవర్ధక శాఖ గుర్తించింది. వీధి కుక్కల నిర్వహణ బాధ్యతలు అవే చూడనున్నాయి.
The government has launched a new initiative to control aggressive street dogs that attack children and pedestrians. Across 123 municipalities, nearly 5.15 lakh street dogs have been identified, out of which 10–15% are considered dangerous. These dogs will be shifted to special shelters called “Dangerous Animal Pounds.
Be the first to comment