ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత సెస్ పేరుతో పాన్ మసాలా కంపెనీల నుంచి వసూలు చేసే దాంట్లో రాష్ట్రాలకు ఏమిస్తారని రాజ్యసభలో పలువురు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. సోమవారం రాజ్యసభలో ‘ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు-2025’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. దీనిపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 5వ తేదీనే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆరోగ్య, జాతీయ భద్రతలకు వెచ్చించే నిధుల వనరులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుద్వారా పాన్ మసాలా తయారుచేసే కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి జీఎస్టీకి అదనంగా సెస్సును కేంద్రం వసూలు చేయనుంది. ప్రస్తుతం పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 28శాతం జీఎస్టీతోపాటు పరిహార సెస్సును వసూలు చేస్తోంది. దాని స్థానంలో పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీని, పాన్ మసాలాపై సెస్సు విధించనుంది.
The Central Government has introduced the Health Security to National Security Bill – 2025 to strengthen funding for national and health security initiatives. Rajya Sabha members questioned how much of the newly proposed cess on pan masala companies would be shared with the states. Finance Minister Nirmala Sitharaman clarified their doubts during the debate.
Be the first to comment