Annavaram Kalyanotsavam 2025 : త్రిమూర్తాత్య్మక స్వరూపుడు. మీసాల స్వామి, నిత్య వ్రతాలతో భక్తుల నీరాజనాలను అందుకునే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. అనంతలక్ష్మి సమేత సత్యదేవుని కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతిఘట్టం భక్తజనులను పరమానందభరితుల్ని చేసింది.
Be the first to comment