Pavan Kumar Reddy Civils 375th Ranker : మంగళవారం నాడు యూపీఎస్సీ సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నైనికి చెందిన శక్తి దుబె మొదటి స్థానంలో నిలిచారు. సివిల్ సర్వీసెస్‌లో 100 లోపు ర్యాంకుల్లో ఐదు సాధించి మరోసారి తెలుగు రాష్ట్రాల అభ్యరులు సత్తా చాటారు. 50 మందికిపైగా తెలుగు అభ్యర్థులు వివిధ కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. తెలుగు విజేతల్లో అమ్మాయిలు పది మందిలోపే ఉండటం గమనార్హం. ఈసారి 1 నుంచి 200 లోపు ర్యాంకు సాధించిన వారిలో పలువురు గతంలోనూ సివిల్స్‌కు ఎంపికైన వారే. అయితే ఐపీఎస్, ఐఏఎస్, తదితర సర్వీస్‌ల కోసం మరో ప్రయత్నం చేసి పలువురు తమ లక్ష్యాన్ని సాధించుకున్నారు.