TDP MP Lavu Sri Krishna Devarayalu Writes Letter to Amit Shah About YS Jagan : బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రజాస్వామ్యానికి హానికరంగా మారారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. పర్యటనల పేరుతో ప్రజల్లో విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వివేకా హత్య కేసు నుంచి కోడికత్తి, రాళ్లదాడి వరకూ అన్నీ క్రుటలే అని లేఖలో ప్రస్తావించారు. జగన్ కుటిల రాజకీయాలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో అమిత్‌షాను కోరారు.