Chennai-Kolkata NH Damaged : ఆరు వరుసల జాతీయ రహదారి కదా అని టాప్ గేర్ వేసి రయ్‌రయ్‌మని దూసుకుపోదామంటే కుదరదు. పైవంతెనలు వచ్చినప్పుడల్లా బ్రేక్ వేయాల్సిందే. లేకుంటే కుదుపులు ఎత్తేస్తాయి పైకి ఎగిరేసి సీట్లో పడేస్తాయి. సర్లే కాస్త స్పీడ్ తగ్గిద్దామని గేర్ మారిస్తే వెనుక వచ్చే వాహనాలకు ముప్పే! చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో చిన్నఅవుటపల్లి నుంచి గుండుగొలను వరకు వంతెనల వద్ద ఇదే పరిస్థితి. అప్రోచ్‌లు కుంగిపోయి ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. వాహనాదారులను ముప్పతిప్పలు పెడుతున్న ఎగుడుదిగుడుల హైవేపై ఈటీవీ భారత్-ఈనాడు క్షేత్రస్థాయి కథనం.
Be the first to comment