Nara Bhuvaneshwari Kuppam Visit : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటన ప్రారంభమైంది. నాలుగురోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ఆమెకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని భువనేశ్వరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.