Campaigning for Railway Recognition Board Elections : రైల్వే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిసెంబరు 4,5,6వ తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో నిలిచిన కార్మిక సంఘాలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ లైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు ప్రచారం నిర్వహించారు. సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ఇంజిన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి భరణి భాను ప్రసాద్, డివిజనల్ కార్యదర్శి ప్రభు రాజు, జోనల్ మహిళా నాయకురాలు సత్యవాణి ఓటర్లను అభ్యర్థించారు.
Be the first to comment