IT Minister Nara Lokesh in US India Strategic Partnership Forum Summit : ఏపీని తొలి ట్రిలియన్ డాలర్ల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు వేగంగా చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో నూతన రాజధాని, పోర్టులు, బిగ్‌డేటా సెంటర్స్, పెట్రో, కెమికల్, ఆక్వా, బయోఫ్యూయల్స్, ఫార్మా, మెడికల్ పరికరాలు, ఐటీ, రంగాల్లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని వెల్లడించారు. 'స్టార్టప్ ఆంధ్ర' నినాదం మాత్రమే కాదన్న లోకేష్, పాలనా విధానాన్ని మార్చే ఆయుధంగా అభివర్ణించారు.