Adulteration Ghee Case in Tirumala : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వేగం పెంచింది. రెండు రోజుల పాటు తిరుపతిలో వరుస సమావేశాలు నిర్వహించిన సిట్ అధికారులు మూడో రోజు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ పోటు, గిడ్డంగులు, ప్రయోగశాలల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో పాటు నెయ్యి నమూనా సేకరణ, నాణ్యత పరీక్షల అంశాలపై సిబ్బందిని విచారించారు.
Be the first to comment