CM Revanth Review On Hyderabad Metro Phase 2 DPRS : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు, రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు సేవలు, అందుబాటులోకి రానుందని ఎన్వీఎస్ఎస్ రెడ్డి వెల్లడించారు.
Be the first to comment