CID Investigation on YSRCP Liquor Scam : జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సీఐడీకి కీలక ఆధారాలు లభించాయి. వరుసగా రెండో రోజు ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన సీఐడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వైఎస్సార్సీపీలో నంబర్ టూ గా చలామణీ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి గుప్పెట్లో ఉన్న కంపెనీకే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్‌కూ ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారని దర్యాప్తులో తేల్చింది. కేవలం అస్మదీయ, కమీషన్లు చెల్లించిన కంపెనీలకే 90 శాతం ఆర్డర్లు ఇచ్చారని బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి పొందారని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది.
Be the first to comment