CM REVANTH INAGURATES COGNIZANT CAMPUS : రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కొనసాగించిన అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. తమ పోటీ, పొరుగు రాష్ట్రాలైనా ఏపీ, కర్ణాటకతో కాదని ప్రపంచంతోనే తమ పోటీ అని పునరుద్ఘాటించారు.