22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో
  • 4 years ago
వాహన తయారీదారులు అప్పుడప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవడం మనం ఇది వరకే చాలా చూసి ఉంటాం. ఈ విధమైన సమస్యలు ఎదురైనప్పుడు కంపెనీ రీకాల్ ప్రకటిస్తుంది.

ఇటీవల కాలంలో స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో 2006 మరియు 2019 మధ్య నిర్మించిన కార్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 మిలియన్ (22 లక్షల) కార్ల అమ్మకాలను జరిపింది. ఈ కార్లలో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్‌ల సమస్య తలెత్తడం వల్ల ఈ కార్లను తిరిగి కంపెనీ రీకాల్ ప్రకటించింది. దీనికి సంబంధించిన కొన్ని నివేదికల ప్రకారం వోల్వో ఇంత పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేయడం ఇదే మొదటి సారి.

వోల్వో కంపెనీకి చెందిన వి 60, వి 70, ఎక్స్‌సి 60 కార్లు లోపభూయిష్టంగా ఉన్నాయి. వోల్వో ఎస్ 60, ఎస్ 60 ఎల్, ఎస్ 60 సిసి, వి 60 సిసి, ఎక్స్‌సి 70, ఎస్ 80, ఎస్ 80 ఎల్‌లతో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.
Recommended