భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కమాండర్ స్థాయి చర్చలు సఫలం అవుతాయా.. కాదా అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం నుంచి సుమారు 11గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలమైనట్టు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లదాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో బలగాలను వెనక్కి రప్పించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.