Prabhas Fan Climbs The Cell Tower In Jangaon || రెబల్ స్టార్ రాకపోతే దూకేస్తానంటూ బెదిరింపు..!!

  • 5 years ago
Prabhas fan climbs the cell tower. He demanded that his favorite actor come down here and meet him. The incident took place in Yashwantpura area of Janagama district.
#Jangaon
#PrabhasFans
#Saaho
#prabhas
#saahocollections
#telangana


సినిమా వాళ్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం సహజమే. అయితే అభిమానుల్లో డైహార్డ్ ఫ్యాన్స్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే వీరిని మించిన పిచ్చి అభిమానంతో ఓ వర్గం ఉంటుంది. వీరి వ్యవహారం కాస్త తేడాగా ఉంటుంది. తమ చర్యలతో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణ ప్రాంతంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభాస్ అభిమానిని అని చెప్పుకుంటున్న ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. 'సాహో' స్టార్ ప్రభాస్‌ను వెంటనే కలవాలని, అతడు ఇక్కడకు రావాలని, లేకుంటే ఇక్కడి నుంచి దూకి చనిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.