Rohit Sharma’s Impromptu Dance on the Field Has Everyone Making the Same Comparison #CWC19 #iccworldcup2019 #indvsa #indiavssouthafrica2019 #msdhoni #rohitsharma #viratkohli
వరల్డ్ కప్‌లో వికెట్లు సాధించడం అంటే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్ బాగా ఎక్కువైనట్టుంది మన టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకి. సౌతాఫ్రికాతో సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఓ క్యాచ్ పట్టాడు. సఫారీ జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన హషీమ్ అమ్లా కొట్టిన క్యాచ్‌ను రోహిత్ పట్టుకున్నాడు. దీంతో మనోడి ఆనందం ఆకాశానికి అంటింది. గ్రౌండ్‌లో సరదాగా ఓ స్టెప్ వేశాడు. అయితే, నెటిజన్లు మాత్రం అలాంటి డ్యాన్స్ వేరేవాళ్లు చేసినట్టు గుర్తించేశారు. ఒకప్పటి WWE రెజ్లర్ రిక్ ఫ్లేయర్‌ను గుర్తు చేశాడంటూ ప్రశంసించారు. రోహిత్ శర్మ.. రిక్ అభిమానా? అంటూ మరికొందరు ప్రశ్నలు సంధించారు.
Be the first to comment