Skip to playerSkip to main contentSkip to footer
  • 1/8/2019
India vs Australia Test Series : BCCI Announces Huge Cash Rewards For History Makers. BCCI includes Players and coach also for this Rewards
#IndiavsAustralia
#StatisticalHighlights
#BorderGavaskarTrophy
#RishabhPant
#CheteshwarPujara
#bcci


ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియాకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) భారీ నజనారా ప్రకటించింది. జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు బీసీసీఐ తెలిపింది. జట్టులోని ఆటగాళ్లు అందుకోబోయే బోనస్ మ్యాచ్ ఫీజ్‌కి ఇది సమానంగా ఉంది. ఇక, రిజర్వ్ ప్లేయర్లకు సైతం రూ.7.5 లక్షల నజరానా అందించనున్నట్టు బోర్డు తెలిపింది. ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా రూ.25 లక్షల చొప్పున నగదు బహుమానం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇక ఆటగాళ్లు అందుకోబోయే నగదు బహుమానం మ్యాచ్ ఫీజుకి సమానం కాగా.. ఆటగాళ్ల కంటే కోచ్‌లకు ఇచ్చే నజరానా ఎక్కువగా ఉండటం గమనార్హం.

Category

🥇
Sports

Recommended