దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమాన్ని ఉధృతం చేసిన వారిలో టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఒకరు. గత కొద్దినెలలుగా శ్రీరెడ్డి పలు సందర్భాల్లో పలువురు అకృత్యాలను బయటపెట్టింది. తమిళ, తెలుగు చిత్ర ప్రముఖలపై ఆరోపణల చేస్తూ సంచలనాలనకు తెర తీసింది. కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్న శ్రీరెడ్డికి బాలీవుడ్‌లో చోటుచేసుకొంటున్న పరిణామాలు బలంగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులపై వస్తున్న కథనాలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తున్నది. తాజాగా విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై కూడా స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. అరవింద సమేత చిత్రం బాగుంది. ఇంకెందుకు ఆలస్యం ఎన్టీఆర్ ఫాన్స్ అందరు తోడ కొట్టండి. అరవింద సమేత చాలా చాలా బాగుంది ఎన్టీఆర్ గారు, ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు త్రివిక్రమ్ గారు అని ట్వీట్ చేసింది.
Be the first to comment