Skip to playerSkip to main content
  • 8 years ago
Nani wife Anjana responds on Srireddy comments. She gives strong counter to SriReddy

సోషల్ మీడియాలో తరచుగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నేచురల్ స్టార్ నానిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తారాస్థాయికి చేరాయి. నేరుగా నానిపై అసభ్యకర వ్యాఖ్యలతో శ్రీరెడ్డి విరుచుకుపడింది. చాలా కాలం పాటు ఓపిక వహించిన అన్ని చివరకు ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యాడు. అందుకు తాను కూడా సిద్దమే అంటూ శ్రీరెడ్డి వెంటనే బదులిచ్చింది. తాజాగా నాని సతీమణి అంజనా కూడా స్పందించి శ్రీరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
చాలా కాలం నుంచి శ్రీరెడ్డి నాని టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తోంది. కానీ ఇటీవల మాత్రం ఆమె వ్యాఖ్యల అసభ్య తీవ్రత మితిమీరే విధంగా ఉందని చెప్పొచ్చు. నాని రంకు బాగోతాన్ని బయట పెడతా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని భావించిన నాని శ్రీరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యాడు.
నాని లీగల్ నోటిసులు పంపిన వెంటనే శ్రీరెడ్డి కూడా ఘాటుగా స్పందించింది. నాకు కావలసింది కూడా అదే అని, నాని రాసలీలలు మొత్తం బయట పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చింది.
Be the first to comment
Add your comment

Recommended