Daily Horoscope దినఫలాలు 28/07/2018

  • 6 years ago
Daily horoscope for Saturday July 28-- here’s what the stars have in store for you today.
#jyothisham
#predictions
#horoscope
#zodiacsign


గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.
మేషరాశి :- ఈ రోజు ప్రారంభంలో కొంత మానసిక ప్రశాంతత తగ్గుతుంది.మీ తెలివితేటలతో ప్రత్యర్ధులను సానుకూలంగా మరల్చుకుంటారు.ఎదుటివారి నుండి కొంత జాగ్రత్తగా మసలుకోవడం అవసరం.వ్యావహారంలో కాని ఇతర ఏ విషయంలో కాని డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి,లేనిచో ఆర్ధికంగా నష్టం వాటిల్లు తుంది.
వృష భరాశి
:- ఈ రోజు వ్యావహారంలో కొంత సవాలుగా ఉంటుంది.పనులలో అసంత్రుప్తి నెలకొంటుంది.మీపై రూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకొండి.అపోహలను నమ్మకండి.ఉద్యోగంలో మీ ప్రతిభకు లోటు ఉండదు.ఇంటా,వ్యావహారంలో సామాన్యంగా పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి.
మిథునరాశి :- ఈ రోజు కొన్ని కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి.వాటిని ఎదుర్కోవటం వలన నీరసం,నిరాధారంగా,శక్తి లేనట్టుగా భావం వస్తుంది.గుండే,శ్వాసకు సంబంధించిన విషయాలలో ఆరోగ్యభంగ సూచనలున్నాయి, జాగ్రత్తలు పాటించండి.పాత స్నేహితులతో సత్సంబందాలు బలపడతాయి.

Recommended