Skip to playerSkip to main contentSkip to footer
  • 7/21/2018
భుజం గాయంతో బాధపడుతోన్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాకు ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ శనివారం అధికారిక ప్రకటన చేసింది. జులై నెలాఖరులో గానీ లేదా ఆగస్టు మొదటివారంలో గానీ మాంచెస్టర్‌లో అతనికి చికిత్స అందించనున్నట్లు బీసీసీసీ వెబ్‌సైట్లో పేర్కొంది.సాహాతో పాటు అతడి భార్యను కూడా ఇంగ్లాండ్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఆమె వీసా దరఖాస్తును బోర్డు పంపించిందని, ఆ ప్రక్రియ జరుగుతోందని వీలైనంత తొందరగా సాహాను ఇంగ్లాండ్‌కు పంపించేందుకు బోర్డు ప్రయత్నిస్తోందని అందులో పేర్కొంది. సాహాకు మాంచెస్టర్‌కు చెందిన డాక్టర్ లెనార్డ్ ఫంక్ ఈ శస్త్రచికిత్స చేయనున్నాడు.

Wriddhiman Saha will undergo a surgery on his shoulder in Manchester at the end of July or beginning of August, the BCCI confirmed on Saturday amid speculations that the Test wicketkeeper's problem was compounded by a "bungled" rehabilitation programme at the NCA.
#wriddhimansaha
#bcci
#ncatest
#indiainengland2018

Category

🥇
Sports

Recommended