Skip to playerSkip to main content
  • 8 years ago
Renu Desai gives clarity on divorce with Pawan Kalyan. She gives counter to Pawan Kalyan fans

రెండు దేశాయ్ రెండవ వివాహం విషయం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో రెండు దేశాయ్ రెండవ వివాహం, పవన్ కళ్యాన్ తో విడాకుల విషయం గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఈ ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారా, ఆ ముసుగులో కొందరి ట్రోలింగ్ కి పాల్పడుతున్నారా అనే విషయం కూడా రచ్చగా మారింది. ఏది ఏమైనా ఈ విషయంలో రెండు దేశాయ్ కూడా కొంత ఘాటుగానే స్పందిస్తోంది. తనని ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా కౌంటర్ ఇస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి రేణుదేశాయ్ వివరించింది. ఈ విషయం లో తనని ట్రోల్ చేస్తున్న వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా రేణు దేశాయ్ పీఆర్ టీం స్పందించింది.
తనతో కాపురం చేస్తుండగానే పవన్ కళ్యాణ్ మరో మహిళతో బిడ్డకు జన్మనిచ్చాడని రేణు దేశాయ్ తెలిపింది. ఈ పరిస్థితులే విడాకులకు దారి తీశాయని తెలిపింది. పవన్ నుంచి తాను విడాకులు కోరుకోలేదని తెలిపింది.
#RenuDesai
Be the first to comment
Add your comment

Recommended