Skip to playerSkip to main content
  • 7 years ago
Big Boss Season 2 Telugu Celebrities remuneration list.

నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2‌‌తో జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. గతంతో పోల్చుకుంటే ఇంకాస్త మసాలా.. ఏదైనా జరగొచ్చు అంటూ టీ గ్లాస్‌తో నాని.. ఎన్టీఆర్‌ని మరిపించే ప్రయత్నం చేస్తున్నా.. జూనియర్ మించలేకపోతున్నాడు ఈ నేచురల్ స్టార్. అయితో మొదట్లో బిగ్ బాస్ సీజన్ 1కి ఇదే విధంగా సో.. సో ‌సాగి ఆ తరువాత పుంజుకుంది. మరి నాని అదే స్థాయిలో ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా బిగ్‌బాస్‌ను నటిపిస్తాడేమో చూడాలి. అయితే ఈ 16 మందిలో ముగ్గుర్ని సామాన్యుల్ని ఎంపిక చేయడం సంతోషించతగ్గ విషయమే. అయితే పాపులర్ కాని వారినే పాపులర్ చేయడమే కదా బిగ్ బాస్ అసలు కాన్సెప్ట్.
ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. గతంతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో పెద్దగా పాపులర్ అయిన సెలబ్రిటీలు లేకపోవడం ప్రేక్షకుల పెదవి విరుపుకి ప్రధాన కారణం. గీతా మాధురి, తేజస్వి మదివాడ తప్పితే మిగిలిన వారందరూ పెద్దగా పాపులర్ కాని వారే.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2 రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానికి 100 ఎపిసోడ్‌లకు మొత్తంగా రూ.3.5 కోట్ల భారీ అమౌంట్ ముట్టినట్లు తెలుస్తోంది. 100 ఎపిసోడ్‌లకు గానూ ఒక్కో ఎపిసోడ్‌కు 10 లక్షల చొప్పున వారంలో రెండు రోజులు అంటే శని, ఆది వారాల్లో హోస్టింగ్ చేయనున్నారు నాని.
Be the first to comment
Add your comment

Recommended