In 2013, the UPA government headed by Manmohan Singh clears the formation of Telangana. On June 2, 2104, K Chandrasekhar Rao takes oath as the first chief minister of Telangana, India's 29th state. #telanganaformationday #kcr #Congress
జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ప్రభుత్వం దీనిని ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తెలంగాణవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు (1-3 తేదీ వరకు జూన్-2018) సంబరాలు నిర్వహించాలని కేసీఆర్ ఢిల్లీలోని అధికారులను ఆదేశించారు. జూన్ 2న వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కొన్ని కీలక అంశాలు. - 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రలో తెలంగాణ విలీనమైంది. పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. - పెద్దమనుషుల ఒప్పందాన్ని ఆంధ్రా పాలకులు తుంగలో తొక్కడంతో 1969లో తొలిసారి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉద్యమం తొలుత ప్రారంభమైంది. అది మిగతా ప్రాంతాలకు పాకింది. 1969లో జరిగిన ఉద్యమంలో 369 విద్యార్థులు అమరులయ్యారు.
Be the first to comment