365 days to go:Countdown to ICC World Cup 2019 begins

  • 6 years ago
Wednesday, May 30 marks a year to go until the greatest celebration of cricket, the ICC Cricket World Cup, gets underway. Hosts England take on South Africa at The Oval in London on May 30, 2019.
బుధవారం(మే 30)కి ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 365 రోజుల తర్వాత ఇదే రోజున ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఆరంభం కానుంది. 2019లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
ఇందులో భాగంగా 2019 వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దీంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌ క్రికెట్ బోర్డు కొందరు క్రికెట్ అభిమానులతో లండన్‌లోని ఐకానిక్ బ్రిక్ లేన్‌లో లాంచింగ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్లైవ్ లాయిడ్, వకార్ యూనిస్, అలెన్ డొనాల్డ్ తదితర క్రికెటర్లు పాల్గొన్నారు.
#iccworldcup2019
#england
#cricket
#Countdown

Recommended