IPL 2018 : Siddarth Kaul Bags A Forgettable Record

  • 6 years ago
Siddarth Kaul started the season on a high but he struggled in the second phase of the tournament. He failed to emulate his form, which also had a big impact on the performance of Sunrisers Hyderabad.
#siddarthkaul
#chennaisuperkings
#cricket
#sunrisershyderabad
#ipl2018

ఐపీఎల్ 2018 సీజన్‌ను అద్భుతంగా ఆరంభించిన సిద్దార్థ్ కౌల్.. సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి పది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టడంతోపాటు భువీ లేని లోటును పూడ్చాడు. దీంతో అతడికి ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో పర్యటించే భారత జట్టులో చోటు దక్కింది. ఇదిలా ఉండగా ద్వితియార్థంలో అతడి ఆటతీరు గాడి తప్పింది. ప్రత్యర్థి జట్లకు భారీగా పరుగులు అప్పజెప్పే పరిస్థితి నెలకొంది.
మే 8న సిద్దార్థ్ కౌల్‌కి భారత జట్టులో పిలుపు రాగా.. తర్వాతి మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసినప్పటికీ.. ధారాళంగా పరుగులిచ్చాడు. చెన్నైతో జరిగిన ఫైనల్లో మూడు ఓవర్లు వేసిన కౌల్ 43 పరుగులు ఇచ్చుకున్నాడు. మే 8 తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో 40కిపైగా పరుగులు ఇచ్చిన కౌల్.. మరో రెండు మ్యాచ్‌ల్లో 30కిపైగా పరుగులు ఇచ్చాడు.

Recommended