Surya, KV Anand Going To Start A New Movie

  • 6 years ago
Director kv.Anand and Suriya have previously worked together in Ayan and Maattraan. Again the both doing a film This film will go on the floors after he wraps up the yet-untitled Selvaraghavan project.Speaking to reporters in sayesha playing heroine role in this film.
#Suriya
#Maattraan
#Selvaraghavan

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో రెండు నెలలో ఈ సినిమా పూర్తి కానుండడంతో తన తదుపరి సినిమాపై ద్రుష్టి పెట్టాడు సూర్య. ఈ సినిమాను దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేవీ ఆనంద్, సూర్య కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య సరసన సయేశా నటించనుందని తెలుస్తోంది. ఈ హీరోయిన్ గతంలో అఖిల్ సరసన అఖిల్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.
గతంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు మంచి విజయం సాధించాయి. సూర్య తో కేవీ ఆనంద్ చెయ్యబోతున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సూర్య ప్రస్తుతం చేస్తున్న ఎన్జికె సినిమా దీపావళీ నాటికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సెల్వ రాఘవన్, సూర్య సినిమా తప్పకుండా మంచి విజయం సాధించవచ్చు.

Recommended