IPL 2018 Set For Star-Studded Launch

  • 6 years ago
IPL 2018 OPening Cermony Was Entertained With Film Super Stars.The First Match Was Going To Held Between Mumbai Indians & Chennai Superkings

క్రికెట్‌ మహోత్సవం ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. క్రికెట్లో ప్రపంచకప్‌, టీ20 కప్‌ ఎలాగ ప్రత్యేకమో... ఐపీఎల్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. ఐపీఎల్ అంటేనే హోరెత్తించే పాటలు.. అందుకు తగ్గట్టుగా చీర్‌ లీడర్ల నృత్యాలు.. సూపర్‌ ఓవర్లు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉంటాయి.
ఐపీఎల్ 11వ సీజన్ తొలి మ్యాచ్‌కు గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి.ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ కు అట్టహాసంగా తెరలేవనుంది. కిక్కిరిసిన అభిమానుల మధ్య లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు తళుక్కుమనబోతున్నారు.
హృతిక్‌ రోషన్‌, తమన్నా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు నృత్యాలతో అభిమానులను కనువిందు చేయనున్నారు. మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వేడుకలు ముగిసిన తర్వాత చెన్నై, ముంబై మ్యాచ్ మొదలవుతుంది. ఐపీఎల్ ఆరంభ వేడుకలకు సంబంధించి ముంబైలోని వాంఖడె స్టేడియంలో బాలీవుడ్ తారలు హృతిక్‌ రోషన్‌, తమన్నా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ శనివారం డ్యాన్స్ రిహార్సల్స్ చేశారు.
ఈ ఫోటోలు ఐపీఎల్ నిర్వాహాకులు తమ అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.
చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియాన్స్ జట్ల మధ్య ఐపీఎల్‌ 11వ సీజన్‌ ఆరంభం కాబోతోంది. ఈ రెండు జట్లు వేటికవే సాటి. అయితే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ జట్టు రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి లీగ్‌లోకి అడుగుపెడుతోంది కాబట్టి. అంతేకాదు ఐపీఎల్‌లో ఎక్కువమంది అభిమానులను కలిగి ఉన్న జట్లలో చెన్నై ఒకటి.

Recommended