Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Young India wicketkeeper batsman Rishabh Pant failed to make an impression during India's loss against Sri Lanka in the Nidahas Trophy tri-series opener on Tuesday.

ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ వల్లే భారత్ ఓటమి పాలైందని ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిదాహాస్‌ ట్రోఫీలో భాగంగా మంగళవారం కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 23 బంతుల్లో కేవలం 23 పరుగులే చేశాడు.

చివరి ఓవర్లో రిషబ్ పంత్ దూకుడుగా ఆడకపోవడంతో ఆతిథ్య జట్టుకు 175 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో 9 బంతుల మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. కుషల్ పెరీరా 37 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Category

🥇
Sports

Recommended