Nidahas Trophy Tri series : Team Indian players eye records
  • 6 years ago
Whether we are favourites or not, that is not something I think about, said Rohit ahead of India's opener against Sri Lanka.

ఈ సిరీస్‌ ద్వారా ఏ ఆటగాళ్లు ఏ రికార్డులను బద్దలు కొట్టనున్నారో తెలుసుకుందాం:

* 6,857 - ఈ సిరిస్‌లో రోహిత్ శర్మ మరో 143 పరుగులు చేస్తే ఏడు వేల పరుగులు క్లబ్‌లో చేరిన మూడో భారత్‌ ఆటగాడు అవుతాడు.
* 595 - టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ నమోదు చేసిన ఫోర్ల సంఖ్య. మరో ఐదు ఫోర్లు కొడితే టీ20ల్లో 600 ఫోర్లు కొట్టిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
* 49 - ఇప్పటి వరకు టీ20ల్లో సురేశ్‌ రైనా బాదిన సిక్స్‌ల సంఖ్య. ఒక్క సిక్స్‌ కొడితే టీ20ల్లో భారత్‌ తరఫున 50 సిక్స్‌లు బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
* 892 - అంతర్జాతీయ క్రికెట్‌లో శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు బాదిన ఫోర్ల సంఖ్య. ఈ టోర్నీలో ధావన్ మరో 8 ఫోర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 900 ఫోర్లు బాదిన 12వ ఆటగాడు అవుతాడు.
* 954 - టీ20ల్లో అక్షర్‌ పటేల్‌ చేసిన పరుగులు. మరో 46 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరుతాడు.
* 921 - టీ20ల్లో బంగ్లా క్రికెటర్ మహమ్మదుల్లా చేసిన పరుగులు. మరో 79 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు పూర్తి చేసిన మూడో బంగ్లా ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.
* 94 - అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా నమోదు చేసిన సిక్స్‌ల సంఖ్య. మరో ఆరు సిక్స్‌లు కొడితే లంక తరఫున 100 సిక్స్‌లు బాదిన చేసిన ఏడో ఆటగాడిగా నిలుస్తాడు.

Recommended