లేడీ అభిమాని మరణంతో హీరో భావోద్వేగం

  • 6 years ago
Actor Sudeep Shocked Over lost life Of His Fan. "Very saddening, prayers for this sister of mine. Wil treasure this picture." Sudeep tweeted.

కన్నడ నాట భారీగా అభిమానులు ఉన్న స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. అభిమానులు ఆయన్ను ఎంతగా ప్రేమిస్తారో.... ఆయన కూడా వారి పట్ల అంతే ఎమోషన్‌తో ఉంటారు. ఇటీవల ఓ అభిమాని క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసి సుదీప్ తట్టుకోలేక పోయారు.
బెంగళూరుకు చెందిన వినూత అనే మహిళ సుదీప్‌‌కు వీరాభిమాని. కొంత కాలంగా వినూత కేన్సర్‌తో బాధపడుతోంది. వ్యాధి ముదిరి చివరి దశకు చేరడంతో మంగళవారం ఆమె మరణించారు. ఈ విషయం తెలిసి సుదీప్ కంటతడి పెట్టారు.
వినూత క్యాన్సర్‌తో బాధ పడుతున్న రోజుల్లో సుదీప్‌ను కలవాలని ఆశ పడింది. అభిమాన సంఘాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుదీప్ ఆమెను తన నివాసానికి పిలిపించి ఆప్యాయంగా పలకరించారు. నువ్వు కేన్సర్‌ను జయిస్తావని దైర్యం చెప్పారు.
వినూత నా చెల్లెలు లాంటిది, ఆమెను కాపాడుకోలేక పోయాం. ఈ సోదరి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ..... సుదీప్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు.
వినూత మరణవార్త, సుదీప్ ట్వీట్ చూసి అభిమానులు చలించిపోయారు. భారీ సంఖ్యలో వినూత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Recommended