Kannada superstar Kichcha Sudeep has been roped in to play the villain in Mahesh Babu's upcoming film "Sarkaru Vaari Paata" with director Parasuram. #MaheshBabu #SarkaruVaariPaata #KichchaSudeep #DirectorParasuram #KiaraAdvani #Tollywood
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. తండ్రి పేరుతో పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని చూపించి ఫేమస్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోగా ఎదిగిపోయాడు. హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫ్లాపుల వల్ల కృంగిపోకుండా ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ పహిల్వాన్‌తో ఫైటింగ్‌కు దిగబోతున్నాడు మహేశ్ బాబు. దీని వెనక భారీ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... ఈ సినిమాకు సుదీప్‌ను విలన్‌గా తీసుకోవడం వెనుక మహేశ్ బాబు వేసిన భారీ ప్లాన్ ఉందట. ‘సర్కారు వారి పాట'ను కన్నడంలోనూ రూపొందించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలిసింది. అందుకే అక్కడి సూపర్ స్టార్‌ను తీసుకుంటున్నారని సమాచారం.