అతడితో విడిపోయాకే కెరీర్ లో ఎదిగా..!

  • 6 years ago
Taapsee Pannu sensational comments on her love story. Taapsee Pannu revels about her love story and break up.

సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సి. తాప్సి కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలు తక్కువసంఖ్యలోనే ఉన్నాయి. కొని చిత్రాలలో తాప్సి సెకండ్ హీరోయిన్ గా మాత్రమే పరిమితమైంది. తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయి రాణిస్తోంది. వాలంటైన్స్ డే సందర్భమగా ఈ భామ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాను ఓ అబ్బాయిని చూసి రెండవ తరగతిలోనే మనసు పారేసుకునట్లు తాప్సి వెల్లడించింది. వాలంటైన్స్ డే సందర్భంగా తాప్సి ఓ ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేసింది. రెండవ తరగతిలో మనసు పారేసుకుంటే దానిని ప్రేమఅని చెప్పలేనని తాప్సి తెలిపింది.
హై స్కూల్ కు వెళ్లిన తరువా అబ్బాయిలు ఎప్పుడూ నన్నే చూడలని కోరుకునేదాన్ని. అందుకోసం ప్రతి రోజూ చక్కగా తయారై వెళ్లేదాన్ని అని తాప్సి చిన్న నాటి విషయాలని నెమరు వేసుకుంది
నాలుగేళ్ళ క్రితం తాను ఓ వ్యక్తి ప్రేమలో పడ్డానని, కొన్నాళకు తామిద్దరం విడిపోయామని తాప్సి తెలిపింది. అతడితో విడిపోయాకే కెరీర్ లో ఎదిగానని తాప్సి చెప్పడం విశేషం. కానీ తాను ప్రస్తుతం ప్రేమలో ఉన్నానా లేదా అనే విషయం బయటకు చెప్పలేనని అది నా వ్యక్తిగత విషయం అని తాప్సి తెలిపింది.
బాలీవుడ్ కు వెళ్ళాక తాప్సి వరుసగా అవకాశాలు అందుకుంటోంది. గ్లామర్ విషయంలో సౌత్ లో పెట్టుకున్నన్ని నిబంధనలు బాలీవుడ్ లో లేవు. ఏకంగా బికినీలో సైతం మెరిసి హల్ చల్ చేసింది.

Recommended