Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Prime Minister Narendra Modi and his Israeli counterpart Benjamin Netanyahu arrived to a traditional reception at Sabarmati Ashram in Ahmedabad after an 8-km roadshow from the airport.

ఆరు రోజుల పర్యటన నిమిత్తం మన దేశానికి వచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులు బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. వీరికి ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు సంయుక్తంగా అహ్మదాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొన్నారు. వీరు రోడ్డు మార్గంలో 8 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు.
ఆశ్రమంలో మోడీ చరఖా గురించి చెప్తుండగా నెతన్యాహు దంపతులు చరఖా తిప్పారు. ఆశ్రమంలో పలు విశేషాలను మోడీ వారికి దగ్గరుండి వివరించారు. అనంతరం మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించారు.
రోడ్‌షో అయినప్పటికీ.. మోడీ, నెతన్యాహుల కాన్వయ్‌లో ఓపెన్‌ టాప్‌ వాహనాలు లేవు. ఇజ్రాయెల్‌ ప్రధాని భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి రోడ్‌షోకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇరువురు నేతల రోడ్‌షోకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. వీరు ప్రయాణించే మార్గంలో దాదాపు 50 వేదికలు ఏర్పాటు చేశారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రత్యేకమైన ప్రదర్శనలతో నేతలకు ఆహ్వానం పలికారు. కాగా, మోడీ, నెతన్యాహులు అహ్మదాబాద్‌లో ఐక్రియేట్‌ సెంటర్‌ ప్రారంభించనున్నారు.

Category

🗞
News

Recommended