Skip to playerSkip to main contentSkip to footer
  • 12/22/2017
In an interview with media actor Nagarjuna bares his heart on all things about his son Hello movie.

హీరోలుగా చరమాంకంలో ఉన్న స్టార్స్ అంతా.. తమ వారసుల్ని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసేందుకు చాలానే కష్టపడుతున్నారు. ఇందులో ముందు వరుసలో ఉంటారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.
అఖిల్ నటిస్తున్న రెండో చిత్రం 'హలో' విజయం కోసం ఆయన చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 'హలో' సినిమాకు మంచి ప్రమోషన్ తీసుకొచ్చేందుకు నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. ప్రీ-రిలీజ్ వేడుకకు చిరంజీవిని తీసుకొచ్చి ఎటెన్షన్ క్రియేట్ చేసిన నాగ్.. గురువారం మీడియాతో చిట్ చాట్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే మీకోసం..
నాగ్ రేపు ఎలాగైనా మనం హిట్ కొట్టాలని అప్పుడే ఫోన్లు, మెసేజ్‌లు వచ్చేస్తున్నాయి. 'మనం' సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ అన్నపూర్ణలో సినిమా చేయాలని విక్రమ్‌ని అడిగాను. కానీ అప్పటికే సూర్యతో '24' సినిమాకి కమిట్ అయ్యానని చెప్పారు. అది పూర్తవగానే అఖిల్‌తో సినిమా చేద్దామని విక్రమ్ అన్నారు. అన్నట్లుగానే ఈ సినిమా చేశారు.
అఖిల్ పాట పాడటం పెద్ద సర్‌ప్రైజ్. చిన్నప్పటి నుంచి అఖిల్‌ని చూస్తున్నాం. కనీసం ఇంట్లో ఎన్నడూ విజిల్ కూడా వేయడు. అలాంటిది ఒక రోజు వచ్చి.. 'హలో' కోసం ఓ పాట తయారైంది నాన్న విను అన్నాడు. ఇది నీ గొంతు లాగే ఉంది కదా అనేసరికి.. నవ్వేశాడు. నాకు అది నిజంగా పెద్ద సర్‌ప్రైజ్.

Recommended